సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల సామాన్యులతో పాటు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా తమ వ్యక్తిగత విషయాలను అందరికీ తెలిసేలా చేస్తున్నారు.ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటున్నారు.
ఒకప్పుడు తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి ఇబ్బందిపడే వాళ్ళు సెలబ్రిటీలు.కానీ ఇప్పుడు అలా కాదు.
తమ ప్రేమ, పెళ్లి విషయాలు కూడా బాగా షేర్ చేసుకుంటున్నారు.తాజాగా మరో బుల్లితెర ఆర్టిస్ట్ త్వరలో పెళ్లి చేసుకోనుండగా వాటికి సంబంధించిన వీడియోలు బాగా పంచుకుంటుంది.
తాజాగా మరో వీడియో కూడా పంచుకుంది.ఇంతకు ఆమె ఎవరంటే.
బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష. పలు సీరియల్స్ లో నటించిన వర్ష.జబర్దస్త్ షో తో ప్రేక్షకులకు పరిచయం అయింది.అంతే కాకుండా మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.
మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్ లో గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయ్యింది.పైగా తన గ్లామర్ తో యువత మనసులను ఇట్టాగే దోచేసుకుంది.
అతి తక్కువ సమయంలో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి హగ్గు లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది.పలు షోలలో కూడా వీరిద్దరూ చేసే రచ్చ కు ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.అంతేకాకుండా ఈ బ్యూటీ పలు షో లలో గెస్ట్ గా పాల్గొని తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటుంది.
ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వర్ష బాగా సందడి చేస్తుంది.ఇక ఈమెకు బుల్లితెరపై మంచి అభిమానం ఉందని చెప్పవచ్చు.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష.నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో యువతను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.నిజానికి ఈమె అందాలను చూస్తే మాత్రం హీరోయిన్ పీస్ అని చెప్పవచ్చు.కానీ దురదృష్టం కొద్దీ ఆమె బుల్లితెర పైన సెటిల్ అయింది.అయినప్పటికీ కూడా ఈమెకు ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.

పొట్టి పొట్టి బట్టలతో బాగా ఎక్స్పోజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది.ఇక వర్ష గతంలో చాలాసార్లు ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంది.ఆ ట్రోలింగ్స్ విషయంలో ఆమె చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.తర్వాత అవన్నీ మామూలే అనుకొని వాటిని పట్టించుకోవడం మానేసింది.ప్రస్తుతం పలు షో లతో పాటు సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంది.
ఇక ఈ బ్యూటీ కి పెళ్లి కుదరగా ఆమధ్య ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో పంచుకుంది.
అయితే తాజాగా మరొక వీడియో పంచుకుంది.అందులో పెళ్లి భాజా మొదలయింది అంటూ. ఒక షాపింగ్ మాల్ లో చీరలు కొనుక్కుంటున్నట్లు కనిపించింది.ఇక తను తీసుకున్న చీరలన్ని చూపించింది.
దీంతో ఆ వీడియో చూసిన తన ఫాలోవర్స్.తనను పొగుడుతున్నారు.
ఏమాత్రం పొగరు చూపించకుండా అందరితో ఫ్రీగా ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.







