అదరగొడుతున్న లావణ్య త్రిపాఠి.. పులిమేక నుంచి మరో యాంగిల్?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారీటీని సంపాదించుకుంది.

 Lavanya Tripathi Gets Great Response Puli Meka Web Series ,lavanya Tripathi, Pul-TeluguStop.com

ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అయితే గత కొంతకాలంగా లావణ్య సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.

ఒకవైపు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే మరొకవైపు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.

Telugu Aadi Saikumar, Ashwin Babu, Puli Meka, Suman, Tollywood, Zee-Movie

ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ పులి మేక.గత కొద్ది రోజులుగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా రెండు రోజుల క్రితమే లావణ్య నటించిన ఈ పులి మేక వెబ్ సిరీస్ జీ5లో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా లావణ్య త్రిపాఠి లేడీ పోలీస్ అధికారి పాత్రలో అదరగొట్టేసింది.

ఓ సీరియల్ కిల్లర్ పోలీస్ అధికారులని హత్య చేస్తుంటాడు.ఈ కేసుని చేధించే బాధ్యత తీసుకున్న లేడి పోలీస్ పాత్రలో లావణ్య నటించింది.

Telugu Aadi Saikumar, Ashwin Babu, Puli Meka, Suman, Tollywood, Zee-Movie

ఆమెకి సహాయం చేసే ఫోరెన్సిక్ నిపుణుడిగా ఆది సాయి కుమార్ నటించారు.కథ లావణ్య కేంద్రంగానే సాగుతుంది.కథ మొత్తాన్ని లావణ్య తన నటన, యాక్షన్, ఎమోషన్ తో నడిపించింది.ఇక ఈ వెబ్ సిరీస్ లావణ్య త్రిపాటికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు.

ఇందులో ఉత్కంఠ భరిత సన్నివేశాలకు తగ్గట్లుగా లావణ్య కూడా పవర్ ఫుల్ గా చేసింది.లావణ్య త్రిపాఠి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube