అదరగొడుతున్న లావణ్య త్రిపాఠి.. పులిమేక నుంచి మరో యాంగిల్?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే.అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారీటీని సంపాదించుకుంది.

ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

అయితే గత కొంతకాలంగా లావణ్య సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.ఒకవైపు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే మరొకవైపు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.

"""/" / ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ పులి మేక.

గత కొద్ది రోజులుగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా రెండు రోజుల క్రితమే లావణ్య నటించిన ఈ పులి మేక వెబ్ సిరీస్ జీ5లో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా లావణ్య త్రిపాఠి లేడీ పోలీస్ అధికారి పాత్రలో అదరగొట్టేసింది.ఓ సీరియల్ కిల్లర్ పోలీస్ అధికారులని హత్య చేస్తుంటాడు.

ఈ కేసుని చేధించే బాధ్యత తీసుకున్న లేడి పోలీస్ పాత్రలో లావణ్య నటించింది.

"""/" / ఆమెకి సహాయం చేసే ఫోరెన్సిక్ నిపుణుడిగా ఆది సాయి కుమార్ నటించారు.

కథ లావణ్య కేంద్రంగానే సాగుతుంది.కథ మొత్తాన్ని లావణ్య తన నటన, యాక్షన్, ఎమోషన్ తో నడిపించింది.

ఇక ఈ వెబ్ సిరీస్ లావణ్య త్రిపాటికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు.

ఇందులో ఉత్కంఠ భరిత సన్నివేశాలకు తగ్గట్లుగా లావణ్య కూడా పవర్ ఫుల్ గా చేసింది.

లావణ్య త్రిపాఠి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.