షుగర్ వ్యాధి.దీనినే మధుమేం అని కూడా పిలుస్తుంటారు.
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, థైరాయిడ్, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు.రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఈ వ్యాధి ఏర్పుడుతుంది.
ఇక ఇది తింటే మధుమేహం తగ్గిపోతుంది.ఆ మందులు వాడితే తగ్గిపోతుందని చాలా మంది చెబుతుంటారు.కానీ, ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.దాన్ని శాశ్వతంగా తగ్గించడం చాలా కష్టం.
అయితే అదుపులో ఉంచుకునేందుకు మాత్రం చాలా మార్గాలు ఉన్నాయి.ముఖ్యాన్ని మధుమేం వ్యాధి గ్రస్తులు కొన్ని కొన్ని కూరగాయలు తీసుకుంటే.
చక్కెర స్థాయిలను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు.మరి ఆ కూరగాయలు ఏంటీ అన్నది ఇప్పుడు తీసుకుందాం.
బెండకాయ షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది.బెండకాయను తరచూ తీసుకోవడం వల్ల.
అందులో ఉండే పలు పోషకాలు రక్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చేస్తాయి.
అలాగే తియ్య తియ్యగా ఉండే చిలకడదుంపలను కూడా మధుమేహం వ్యాధి గ్రస్తులు డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
చిలకడ దుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ లెవల్స్‌ను సమర్థవంతంగా అదుపు చేయగలవు.పొటాషియం, పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండే వంకాయలకు కూడా చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి ఉంది.
కాబట్టి, వంకాయను తరచూ తీసుకుంటే మంచిది.
ఇక వీటితో పాటుగా బీట్ రూట్, కాకర కాయ, సొర కాయ, ఉల్లి పాయ వంటి కూరగాయలు కూడా బ్లడ్ షగర్ లెవల్స్‌ను అదుపు చేస్తాయి.
కాబట్టి, వీటిలో మధుమేహం వ్యాధితో బాధ పడే వారు డైట్‌లో చేర్చుకుంటే మంచిది.అయితే ఈ కూరగాయలను ఆయిల్స్‌లో బాగా ఫ్రై చేసి తీసుకోవడం కంటే ఉడికించి తీసుకోవడం, సలాడ్స్ రూపంలో తీసుకోవడం, రోస్ట్ చేసి తీసుకోవడం మంచిది.