ఈ ఒక్క‌టి రెగ్యుల‌ర్ డైట్‌లో ఉంటే గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు!

గుండె.శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వం.

 If You Have This One In Your Regular Diet, You Can Stay Away From Heart Disease!-TeluguStop.com

త‌ల్లి క‌డుపున ప‌డిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయే వ‌ర‌కు నిరంత‌రం ప‌ని చేసే గుండెను ఎంతో జాగ్ర‌త్త‌గా సంర‌క్షించుకోవాలి.అది మ‌న బాధ్య‌త‌.

కానీ, ఆ బాధ్య‌త‌ను చాలా మంది ప‌క్క‌న పెట్టేస్తున్నారు.ఫ‌లితంగా గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు.

ప్ర‌స్తుత రోజుల్లో గుండె జ‌బ్బుల బాధితుల సంఖ్య భారీగా పెరిగి పోతోంది.ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, మ‌ద్య‌పానం, కొవ్వు అసాధారణ స్థాయిలో ఉండటం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌ పోవ‌డం, ఓవ‌ర్ వెయిట్‌ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు గుర‌వుతున్నారు.

కార‌ణం ఏదైనా ఇప్పుడు చెప్ప‌బోయే ఒక్కటి రెగ్యుల‌ర్ డైట్ లో ఉంటే గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.ఇంత‌కీ ఆ ఒక్క‌టి మ‌రేంటో కాదు.క్యారెట్‌.దుంపుల్లోనే అద్భుత‌మైనది మ‌రియు అమోఘ‌మైన‌ది.

విటమిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, విట‌మిన్ బి, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోష‌కాలు క్యారెట్‌లో పుష్క‌లంగా నిండి ఉంటాయి.

Telugu Benefits Carrot, Carrot, Carrot Heart, Tips, Heart Diseases, Heart, Lates

అందుకే ఆరోగ్య ప‌రంగా క్యారెట్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా రోజుకు ఒక క్యారెట్‌ను తీసుకుంటే ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే క్యారెట్‌ను ప్ర‌తి రోజూ తీసుకుంటే గుండె జ‌బ్బుల‌కు కార‌ణం అయ్యే ఓవ‌ర్ వెయిట్‌, అధిక ర‌క్త‌ పోటు, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల నుండి విముక్తి ల‌భిస్తుంది.

క్యారెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ప‌ని తీరు సైతం మెరుగ్గా మారుతుంది.కాబ‌ట్టి, గుండె జ‌బ్బుల నుండి ర‌క్ష‌ణ పొందాల‌నుకుంటే త‌ప్ప‌కుండా క్యారెట్‌ను డైట్‌లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube