స్మాల్ స్క్రీన్ పై సుధీర్, రష్మిక జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒకరు యాంకర్.
మరొకరు కమెడియన్ ఇలా ఈ ఇద్దరు కలిసి వారి మధ్య ఏదో జరుగుతుంది అని ఒక రూమర్ పుట్టించి దాని మీద ఏళ్ల తరబడి ఒక క్రేజ్ తీసుకొచ్చారు.జబర్దస్త్ లోనే కాదు సుధీర్, రష్మి ఎక్కడ కనిపించినా స్పెషల్ ఎట్రాక్షన్ వల్ల ఆ న్యూస్ వైరల్ అవుతుంది.
కొందరు ఆడియెన్స్ అయితే సుధీర్, రష్మిల పెళ్లి పక్కా అని కూడా ఫిక్స్ అయ్యారు.కానీ ఇదంతా షో కోసమే అని అందరు చెప్పారు.
సుధీర్, రష్మిలు కూడా అది ఒప్పుకున్నారు.
అయితే సుధీర్, రష్మిలని వాడుకుని షో రేటింగ్ పెంచాలని అనుకోవడం పెద్ద పొరపాటేమి కాదు.
అలా కలిసి వచ్చింది.ఆడియెన్స్ కూడా వీరి జోడీని ఇష్టపడటం వల్ల అలా కలిసి వచ్చింది.
ఇదంతా ఇలా ఉంటే ఈమధ్య సుధీర్, రష్మిల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్.సుధీర్ ఎలాగు మల్లెమాలకు గుడ్ బై చెప్పి స్టార్ మాకి వచ్చేశాడు.
ఈ క్రమంలో సుధీర్, రష్మిల ఆ ర్యాపో కూడా దూరమైంది.అంతేకాదు రష్మి బదులుగా సుధీర్ ఇప్పుడు స్టార్ మా లో కొత్త యాంకర్ దీపిక పిల్లితో క్లోజ్ గా ఉంటున్నాడు అన్నది కొత్త న్యూస్.

అంతేకాదు సుధీర్, దీపికలు కలిసి వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో కూడా నటించాడు.రైటర్ శ్రీధర్ సీపాన మెగా ఫోన్ పట్టుకుని చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దీపిక పిల్లి నటించింది.ఈ ఇద్దరి జోడీ సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నారు.ఆ కారణ వల్లే కావొచ్చు సినిమా ప్రమోషన్స్ లో.ఇంకా బయట కూడా సుధీర్ తో దీపిక పిల్లి క్లోజ్ గా ఉంటుందని అంటున్నారు.అయితే సుధీర్ పక్కన రష్మి ప్లేస్ లో మరొకరిని ఊహించుకోవడం కొద్దిగా కష్టమే కాని ప్రోగ్రాం డైరక్టర్స్ అలా ఫిక్స్ అయితే మాత్రం ఆడియెన్స్ కూడా ఈ జోడీని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది.







