ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండు మూడేళ్ళలోనే యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే.కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ కుర్ర హీరో ఇంత తక్కువ సమయం లో ఈ రేంజ్ కి వెళ్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.‘అర్జున్ రెడ్డి’( Arjun Reddy ) చిత్రం నుండే అతనికి యూత్ లో పునాది పడింది.ఆ తర్వాత గీత గోవిందం చిత్రం తో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ( Vijay Deverakond ) స్టార్ హీరో రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి.హిట్ / ఫ్లాప్ తో తేడా లేకుండా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ కి సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ కి ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా రెండు కోట్ల మంది ఫాలోయర్స్ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ కి కేవలం 60 లక్షల మంది ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు.ఇక రీసెంట్ గా వాట్సాప్ లో చానెల్స్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది.అంటే ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో ఎలా అయితే ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చో, అలా వాట్సాప్ లో కూడా చేసుకోవచ్చు అన్నమాట.మన టాలీవుడ్ నుండి ఇప్పటి వరకు కేవలం విజయ్ దేవరకొండ మరియు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చానెల్స్ క్రియేట్ చేసుకున్నారు.
విజయ్ దేవరకొండ కి 1 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ రాగా, జూనియర్ ఎన్టీఆర్ కి కేవలం లక్ష 20 వేల మంది ఫాలోయర్స్ మాత్రమే వచ్చారు.ప్రతీ ఒక్కరు తరుచు వాడే వాట్సాప్ లో ఈ ఇద్దరి హీరోలకు ఇంత వ్యత్యాసం ఉండడం ని చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఇంకా టాలీవుడ్ హీరోలు వాట్సాప్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది, వాళ్లకి ఏ రేంజ్ ఫాలోయర్స్ వస్తారో చూడాలని ఉందంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్( Prabhas ) వంటి హీరోలు రావాల్సి ఉంది.ఇంస్టాగ్రామ్ రీచ్ కంటే కూడా, ఈ వాట్సాప్ రీచ్ వేరే లెవెల్ లో ఉండడం విశేషం.రాబొయ్యే రోజుల్లో స్టార్ హీరోల ఫస్ట్ లుక్ లు , టీజర్లు మరియు ట్రైలర్స్ కూడా ఈ వాట్సాప్ లోనే విడుదల కాబోతున్నాయి.