దేవుడా.. 3 వేల కేజీల ఆపిల్స్ తో గుడి అలంకరణ.. ఎక్కడో తెలుసా..?!

కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రార్థన మందిరాలు అన్నిటిని కూడా మూసి వేయడం జరిగింది.

 Temple Decoration With 3 Thousand Kg Of Apples Do You Know Somewhere Apples, Of-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ లాక్ సంబంధించి ప్రార్థన మందిరాలు యధావిధిగా తెరుచుకోవచ్చన్న ప్రకటనతో దేశంలోని ఆలయాలు తెరుచుకున్నాయి.అసలు విషయంలోకి వెళితే…

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో శ్రీ స్వామి నారాయణ మందిరం మంగళవారం నాడు తిరిగి తెరుచుకుంది.

అయితే ఈ సందర్భంగా ఏకంగా మూడు వేల కేజీల ఆపిల్ పండ్ల తో ఆ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.గుడిలోని దేవుడికి ప్రాత కాల సమయంలోనే మొదలయిన సేవల కోసం కేవలం తక్కువ మంది భక్తులను మాత్రమే అనుమతించి పూజలు నిర్వహించారు.

ఇకపోతే ఉదయం నుంచి తక్కువ మంది భక్తులను అనుమతి ఇస్తూనే మరోవైపు ఆలయ నిర్వాహకులు కనీస సామాజిక దూరం పాటించాలంటూ పదేపదే భక్తులకు విజ్ఞప్తి చేస్తూ జాగ్రత్త పరిచారు.అంతేకాదు ఆలయ నిర్వాహకులు గుడిలోకి లోపలి వచ్చే సమయంలో సబ్బు, నీరు అలాగే శానిటైజర్ ను అందుబాటులో ఉంచారు.

అంతేకాకుండా ఎవరైతే దర్శనానికి వస్తున్నారో వారు ఖచ్చితంగా మాస్కు ధరించేలా చూశారు.ఇకపోతే ఏకంగా మూడు వేల కేజీలతో అలంకరించిన ఆలయంలోని పండ్లను పూజల అనంతరం ఆ ఆపిల్స్ ఆ ప్రాంతంలో కరోనా వైరస్ కి గురైన వారికి అలాగే వారికి సేవలు అందించిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు అలాగే డాక్టర్స్ కు పంపిణీ చేస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.

దాదాపు ఏడు నెలల తర్వాత స్వామి నారాయణ మందిరంని తెరవడం జరిగింది.ఇకపోతే గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటివరకు 39 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube