అవును అనుపమ డిమాండ్ చేస్తుందట..!

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ దాదాపు ముగిసింది అనుకునేలోగా మళ్లీ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.ప్రేమం సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు తెలుగులో ముందు అఆ సినిమా చేసింది.

 Anupama Parameswaran Demand Remuneration , 18 Pages,anupama, Anupama Parameswara-TeluguStop.com

అప్పటి నుంచి తన నటనతో మెప్పిస్తూ వచ్చింది.బొద్దుగా ఉండటం వల్ల అవకాశాలు రావట్లేదు అనుకుని స్లిమ్ గా మారిన అనుపమ ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తుంది.

కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో అలరించిన అనుపమ లేటెస్ట్ గా బటర్ ఫ్లై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎలాగు సక్సెస్ ఫాం లో ఉన్నాం కదా అని రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తుందట అనుపమ.

అంతకుముందు 70 నుంచి 80 లక్షల దాకా తీసుకునే అనుపమ ఇప్పుడు సినిమాకు కోటి కోటిన్ 20 లక్షల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.అనుపమకి మార్కెట్ కూడా బాగానే ఉండటంతో ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే అంటున్నారు దర్శక నిర్మాతలు.

మొత్తానికి అనుపమ కూడా మళ్లీ కెరీర్ లో అదరగొట్టేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ప్రస్తుతం అనుపమ తెలుగులో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

అందులో ఒక స్టార్ హీరో సినిమా ఉందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube