ఛత్తీస్‎ఘడ్‎లోని నారాయణ్‎పూర్‎లో తీవ్ర ఉద్రిక్తత

ఛత్తీస్‎ఘడ్‎లోని నారాయణ్‎పూర్‎లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివాసీలు చర్చిపై దాడికి దిగారు.

పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆదివాసీలు చర్చీని ధ్వంసం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆదివాసీలు చేసిన రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు