ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత
TeluguStop.com
ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివాసీలు చర్చిపై దాడికి దిగారు.
పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆదివాసీలు చర్చీని ధ్వంసం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆదివాసీలు చేసిన రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాంటి సన్నివేశాలు నా వల్ల కాదు.. సాయిధన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!