తారక్-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఆరోజే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Trivikram Ntr Movie To Go On Sets From October, Trivikram, Ntr, Ntr30, Ainanu Po-TeluguStop.com

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండటంతో ఆయన ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన త్రివిక్రమ్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యాకే త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు.

దీంతో ఈ సినిమాను అక్టోబర్ 1న సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

కాగా ఈ సినిమాను ఏప్రిల్‌లోనే పట్టాలెక్కించాల్సి ఉన్నా, లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.

దీంతో ఇప్పుడు ఎలాగైనా అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్థినకు అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.మరి ఇప్పుడైనా అనుకున్నట్లుగానే అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube