సాధారణంగా మనం నిత్యం వాడే టీవి రిమోట్స్ పై ఎడమ వైపు కాని కుడి వైపు కాని మొదటగా ఆన్, ఆఫ్ బటన్స్ ను మనం చూస్తూ ఉంటాం కదా.ఇవి సాధారణంగా రెడ్ కలర్ లోనే ఉండటం మనం గమనించవచ్చు.
చూడగానే గుర్తించడానికి సులువుగా ఉండేలా ఈ సింబల్స్ ను ఈ కలర్ లో ఇస్తారు.అందువలనే టీవి రిమోట్స్ లో ఎన్నిబటన్స్ ఉన్నా ఈ ఆన్ ఆఫ్ బటన్స్ ను వయసుతో, చదువుతో సంబంధం లేకుండా ఈజీగా తేలికగా గుర్తు పడతారు.
అయితే ఇవి కేవలం టీవి రిమోట్ల పైనే కాదు కొన్ని రకాల స్విచ్ బోర్డ్ లపైనా కూడా మనం గమనించవచ్చును.అయితే ఈ సింబల్స్ అలానే ఎందుకు ఉంటాయి? అనే సందేహం మనలో అనేకమందికి రావొచ్చు.
ఇపుడు దాని వెనుక వున్న కారణం తెలుసుకుందాం.ఆన్ ఆఫ్ బటన్ సింబల్ ను ఒకసారి జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే, మధ్యలో ఒక నిలువు గీత ఉండి, దాని చుట్టు సర్కిల్ ఉన్నట్లు ఉంటుంది.
పవర్ బటన్ లు మరియు స్విచ్ లు సాధారణంగా “ I “ మరియు “o“ సింబల్స్ తో లేబుల్ చేయబడతాయి.“I “ పవర్ ను సూచిస్తుంది.
“O“ పవర్ ఆఫ్ ను సూచిస్తుంది.ఇలా కొన్నింటిలో I/O లేదా “ I “ మరియు “ O “అక్షరాలు ఒకదానిపై ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి.
డెస్క్ టాప్ లు, ట్యాబ్లెట్ లు, నెట్ బుక్ లు, ల్యాప్ ట్యాప్ లు ఇలా అన్ని రకాల కంప్యూటర్లలో పవర్ బటన్ లు ఉంటాయి.

ఇక మొబైల్ పరికరాలలో చూసినట్లయితే, ఈ పవర్ బటన్ సింబల్స్ సాధారణంగా మొబైల్ వైపు లేదా పైభాగంలో ఉంటాయి.మరి కొన్నిసార్లు కీబోర్డ్ పక్కనే ఉంటాయి.కంప్యూటర్ పరిభాషలో “ I “ అంటే ఆన్ అని అర్ధం.
అలాగే “O “ అంటే ఆఫ్ అని అర్ధం.అందుకే ఈ అక్షరాలను ఉపయోగించి సింబల్ ను డిజైన్ చేస్తారు.
ఈ సింబల్ ను అందరు గుర్తుపట్టేలా రెడ్ కలర్ లో ఇస్తారు.ఇలా అయితే సింబల్ ను గుర్తుపట్టడానికి సులువు అవుతుంది.
ఇదే దీనివెనకాల వున్న అసలు కారణం.