సాధారణంగా చాలామంది ప్రజలు ఆపిల్( Apple ) తర్వాత రోజు తింటే ఆరోగ్యానికి మంచిదని భావించే ఏకైక పండు అరటిపండు( banana ).ఎందుకంటే అరటి పండు లో విటమిన్లు, ఫైబర్, ఐరన్, క్యాల్షియం మరియు పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
చాలా మంది పచ్చి అరటికాయలను వండుకొని కూడా తింటూ ఉంటారు.అయితే అరటిపండు ఎక్కువగా పండినప్పుడు దానిపై తొక్క నలుపు రంగులోకి మారడం మనం చూస్తూనే ఉంటాము.
అటువంటి పరిస్థితులలో చాలామంది ప్రజలు అరటిపండు పాడైపోయిందని కుళ్లిపోయినట్లు భావించి చెత్తలో పారేస్తు ఉంటారు.
అయితే అతిగా పండిన అరటి పండ్ల( Overripe bananas )ను పారేయకుండా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అతిగా పండిన అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అతిగా పండిన అరటిపండు లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.అయితే అలాంటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇందులో పొటాషియం,మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.ఇవి రక్త పోటు ను అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అతిగా పండిన అరటి పండ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది.ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది.
బాగా పండిన అరటిపండు తొక్కలో ఒక రకమైన పదార్థం ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు.
ఇది క్యాన్సర్ కణాలు, ఇతర ప్రమాదకరమైన కణాలు పెరగకుండా నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా కండరాల నొప్పితో ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కువగా పండిన అరటి పండ్లను తినడం అలవాటు చేసుకోవడం మంచిది.ఎందుకంటే వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.అందువల్ల కండరాల నొప్పి అదుపులో ఉంటుంది.