ఇటీవలి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా నాగా సాధువులుగా మారుతున్నారు.స్త్రీలు నాగా సాధువులుగా మారాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇటీవలికాలంలో మహిళలకు నాగా సాధువులుగా మారేందుకు దీక్షలు ఇస్తున్నారు.నాగా సాధువులుగా మారే వారిలో విదేశీ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు.
స్త్రీ నాగా సాధువులు, పురుష నాగా సాధువులకు సంబంధించిన నియమ నిబంధనలలో కొన్ని తేడాలు ఉంటాయి.పురుషుల మాదిరిగానే మహిళా నాగా సాధువుల జీవితం దేవునికే అంకితం అవుతుంది.
వారి దినచర్య దైవారాధనతో కూడి ఉంటుంది.ఒక స్త్రీ నాగా సాధువుగా మారినప్పుడు ఆమెను అమ్మ అని పిలవడం ప్రారంభిస్తారు.
మహిళా నాగా సాధువులు తమ నుదుటిపై తిలకం దిద్దుకోవాలి.దేహమంతా ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించడానికి అనుమతి ఉంటుంది.
నాగా సాధువు కావడానికి ముందు, స్త్రీ 6 నుండి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి.దీనిలో విజయం సాధించినప్పుడే ఆమె నాగా సాధువుగా మారడానికి అనుమతిస్తారు.
నాగా సాధువుగా మారుతున్నప్పుడు ఆ స్త్రీ తాను పూర్తిగా భగవంతునికి అంకితమైనట్లు నిరూపించుకోవాలి.ప్రాపంచిక సుఖాల పట్ల ఇష్టం లేనట్లు స్పష్టం చేయాలి.
నాగా సాధువు కావడానికి ముందు, ఆ మహిళ తనకు తాను పిండ ప్రధానం చేసుకుని, గత జీవితానికి స్వస్తి పలకాలి.
స్త్రీలను నాగా సాధువులుగా చేసే ప్రక్రియను అఖాడాల అత్యున్నత గురువు ఆచార్య మహామండలేశ్వర్ పూర్తి చేశారు.స్త్రీలు నాగా సాధువుగా మారేటప్పుడు ముందుగా శిరోముండనం చేయించుకోవాలి.ఆ తర్వాత నదిలో పవిత్ర స్నానం చేయాలి.
స్త్రీ, పురుష నాగా సాధువుల మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం కనిపిస్తుంది.మగ నాగా సాధువులు పూర్తి నగ్నంగా ఉంటారు, ఆడ నాగ సాధువులు తమ శరీరాలను కాషాయ రంగు వస్త్రంతో కప్పుకుంటారు.
పురుష నాగా సాధువులతో సమానమైన గౌరవం స్త్రీ నాగా సాధువులకు కూడా లభిస్తుంది.
LATEST NEWS - TELUGU