ఇక్కడ దాదాపు అందరికీ రాజీనామా లేఖ రాసే అలవాటు ఉంటుంది.తను పని చేస్తున్న సంస్థకు ఏవో కారణాలతో ఏదో ఒకరోజు ఇక్కడ ప్రతిఒక్కరూ రాజీనామా అనేది చేయాల్సిందే.
ఓనర్ కి మనం నచ్చకపోయినా చేయాలి, మనకి ఓనర్ నచ్చకపోయినా రాజీనామా అనేది తప్పనిసరి.ఈ క్రమంలో అనేకమంది అనేకరాలుగా రాజీనామా లేఖలు రాస్తూ వుంటారు.
దాదాపుగా అందరూ రాసే కంటెంట్ ఉద్దేశం ఒక్కటే అయినా, రాసే స్టైల్ కొంచెం వేరేగా ఉంటుందని ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ( Swiggy Instamart )తాజాగా షేర్ చేసిన రాజీనామ లేఖ చూస్తే కచ్చితంగా మీరు నవ్వుకోవడం ఖాయం.

అవును, నేటి మన దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్న చాక్లెట్లు, బిస్కెట్ల బ్రాండ్లు( chocolates , biscuits ) ఉపయోగించి రాజీనామా లేఖ రాయడం ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది.దాంతో సదరు పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో అందుబాటులో ఉన్న స్నాక్ ఐటమ్స్‌తో ఆ రాజీనామా లేఖను రూపొందించింది.ఆ లేఖలో పలు పదాలకు బదులుగా సొసైటీ టీ, కెలాగ్స్, లిటిల్ హార్ట్స్, పెర్క్, గుడ్ డే, ఫైవ్ స్టార్, ఎవరెడీ, జెమ్స్ వంటి బ్రాండ్లను ఉపయోగించి ఆ రెజిగ్నేషన్ లెటర్‌ను రూపొందించింది అందరి దృష్టిని ఆకర్శించింది.

“ఇన్‌స్టామార్ట్‌ను ఉపయోగించి ఈ విధంగా మీ జాబ్‌కు రాజీనామా చేయొచ్చు తెలుసా?” అంటూ ట్వీట్ చేసింది.దాంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.కాగా ఇప్పటివరకు దానిని లక్షల్లో వీక్షించడం కొసమెరుపు.లైకులు అయితే ఇక లెక్కపెట్టడం కష్టం.దాంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.కొందరు చాలా సీరియస్ మేటర్‌ను ఇన్‌స్టామార్ట్ ఫన్నీగా మార్చేసింది అని కామెంట్ చేస్తే, మరికొందరు ఇది చాలా ఫన్నీగా ఉంది… నేను కూడా ట్రై చేస్తా అంటూ కొందరు ఔత్సాహికులు కామెంట్స్ చేస్తున్నారు.
అవును, సదరు లేఖలో పదాలకు బదులుగా ఉపయోగించిన బ్రాండ్ల పేర్లను నేను నిజంగానే మా బాస్‌కు చెప్పాలనుకున్నా….అంతో కొందరు కామెంట్స్ చేస్తుండడం ఇక్కడ మనం చూడవచ్చు.
ఇంకెందుకాలస్యం.మీరు కూడా ట్రై చేసి చూడండి!







