18 ఏళ్లకే డ్రోన్ పైలెట్.. ఆ లైసెన్స్ పొందిన తొలి అమ్మాయి.. రిన్ష పట్టక సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

చిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ప్రతిభతో పాటు కష్టపడే గుణం సైతం ఉండాలి.ఎంతో కష్టపడితే మాత్రమే కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.18 ఏళ్లకే డ్రోన్ పైలెట్ లైసెన్స్ పొందిన రిన్ష పట్టక( Rinsha Pattaka ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో డ్రోన్ కల్చర్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే.

 Drone Pilot At 18 Years Rinsha Pattakal Success Story Details, Rinsha Pattakal,-TeluguStop.com

షూటింగ్ లు, పొలిటికల్ కార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలలో డ్రోన్ వినియోగం కచ్చితంగా ఉంటుంది.అయితే ఎక్కువగా డ్రోన్ ఆపరేటర్లుగా అబ్బాయిలు కనిపిస్తారు.అయితే ఇప్పటికే చాలా రంగాలలో అబ్బాయిలకు అమ్మాయిలు గట్టి పోటీ ఇస్తుండగా డ్రోన్ ఆపరేటింగ్( Drone Operating ) విషయంలో సైతం అబ్బాయిలకు తామేం తక్కువ కాదని రిన్ష పట్టక ప్రూవ్ చేసింది.18 సంవత్సరాలకే డ్రోన్ పైలెట్ లైసెన్స్ పొందిన తొలి యువతిగా ఆమె వార్తల్లోకెక్కింది.

Telugu Drone Pilot, Dronepilot, Kerala, Malappuram, Rinsha Pattakal, Rinshapatta

కేరళ రాష్ట్రంలోని( Kerala ) మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు చిన్నప్పటి నుంచి ఎగిరే డ్రోన్లను చూడటం మహా సరదాగా ఉండేది.తన తండ్రి సివిల్ ఇంజనీర్ కావడంతో రిన్ష పట్టక తన తండ్రి ద్వారా అన్ని విషయాలను తెలుసుకున్నారు.ప్లస్ టు పూర్తైన తర్వాత రిన్ష పట్టక డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్( Drone Flying Training ) కోర్సులో చేరారు.క్లాసులో ఒక్కతే అమ్మాయి అయినా ఎంతో కష్టపడి రిన్ష పట్టక శిక్షణ తీసుకున్నారు.

Telugu Drone Pilot, Dronepilot, Kerala, Malappuram, Rinsha Pattakal, Rinshapatta

కోర్సులో అన్ని విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్న రిన్ష పట్టక మీడియాతో మాట్లాడుతూ డ్రోన్స్( Drones ) వల్ల ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.మన దేశంలో డ్రోన్స్ ఆపరేట్ చేయాలంటే డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ ఉండాలి.ఈ లైసెన్స్ ను పొందిన రిన్ష తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube