'క్రిక్‌పే' యాప్ గురించి విన్నారా? ఎలా పనిచేస్తుందంటే?

థర్డ్ యూనికార్న్ కంపెనీ చైర్మన్, భారత్ పే సహ వ్యవస్థాపకుడు అయినటువంటి ‘అష్నీర్ గ్రోవర్’( Ashneer Grover ) కొత్తగా క్రికెట్ రంగంలోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ ‘క్రిక్‌పే’( crickpay ) లాంచ్ చేయడంతో తన ఉనికిని ఈ ప్రపంచానికి చాటిచెప్పారు.

 Heard Of 'cricpay' App How Does It Work, Crick Pay Application, Bharat Pay, Ceo-TeluguStop.com

ఇండియన్ ప్రీమియం లీగ్ ( Indian Premium League )మరో వారంలో ప్రారంభం అవుతుండగా అష్నీర్ గ్రోవర్ ఈ యాప్ తీసుకు రావడం విశేషం.ఈ విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు.

ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.

Telugu Bharat Pay, Crick Pay, Latest, Launch, Ups-Latest News - Telugu

ఐపీఎల్ తర్వాత క్రికెట్లో ఇదొక పెద్ద విప్లవం అని తన యాప్ లాంచ్ సందర్భంగా అభివర్ణించారు గ్రోవర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రికెట్ అభిమానులను, క్రికెట్ ని గెలిపించే ఈ ఫాంటసీ యాప్ అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసారు.ఇకపోతే క్రిక్‌పే అనేది భారతదేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన ఫాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్.

ఇక్కడ ప్రతిరోజూ ‘క్రికెట్ గెలుస్తుంది’.ఇది ప్రపంచంలోని ఏకైక ఫాంటసీ క్రికెట్ యాప్ కావడం విశేషం.

ఇక్కడ మ్యాచ్లో భాగంగా అసలైన క్రికెటర్లు, క్రికెట్ జట్లు, నిజమైన జట్టు యజమానులు ఫాంటసీ గేమ్-విన్నర్స్ నగదు రివార్డులను గెలుచుకుంటారు అని… గూగుల్ ప్లే స్టోర్లో వివరించడం జరిగింది.

Telugu Bharat Pay, Crick Pay, Latest, Launch, Ups-Latest News - Telugu

ఇకపోతే క్రికెట్ యాప్ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ఉదాహరణకు డ్రీమ్ 11, మొబైల్ ప్రీమియర్ లీగ్ గేమ్స్24×7 సంస్థకు చెందిన మై 11 సర్కిల్ యాప్లకు మిలియన్ల కొద్దీ యూజర్లు వున్న సంగతి అందరికీ తెలిసినదే.ఇకపోతే ఈ యాప్స్ పోటీని తట్టుకుని క్రిక్పే నిలబడాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇంకాఆప్టే అష్నీర్ గ్రోవర్, “థర్డ్ యునికార్న్ ప్రైవేట్ లిమిటెడ్” కోసం సుమారు $4 మిలియన్ల నిధులు సేకరించారు.ఫండింగ్ రౌండ్లో అన్మోల్ సింగ్ జగ్గీ, అనిరుధ్ కేడియా, విశాల్ కేడియా సహా రెండు డజన్ల మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.

ఇకపోతే భారత్ పే విషయంలో వివాదాల్లో వున్న విషయం తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube