కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా కర్రల సమరం కొనసాగుతుంది.దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది.
పోలీసులు, రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేసి ఉత్సవం చేపట్టారు.100 మందికిపైగా గాయపడ్డప్పటికీ.ప్రాణహాని తప్పటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టు లో ఏటా కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ.ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది.
ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల ఎంతో మందికి తీవ్రగాయాలై మరణించిన ఘటనలూ ఉన్నాయి.కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.
దేవరగట్టు బన్ని ఉత్సవం ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయం వెలసింది.ఈ గుడిలోని దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరునికి దసరా పర్వదినాన కల్యాణం జరిపించి కొండ పరిసర ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు.
ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు.
దీనినే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.గతంలో ఈ ఉత్సవాలను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా వంద మందికిపైగా గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.సంబరం మాటున సాగే కర్రల సమరాన్ని నిషేధించాలని 2008లో జాతీయ మానవహక్కుల కమీ షన్ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు ఫలితం కనిపించలేదు.
DEVOTIONAL