ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవిత రిమాండ్ ముగియనుంది.
ఈ నేపథ్యంలో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) హాజరుపరిచే అవకాశం ఉంది.
ఈ మేరకు మరో పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ( Judicial custody ) పొడిగించాలని సీబీఐ, ఈడీ న్యాయస్థానాన్ని కోరనున్నాయి.
ఈ క్రమంలోనే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోనుంది.విచారణ అనంతరం ఛార్జ్ షీట్ కాపీని కవితకు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.