నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవిత రిమాండ్ ముగియనుంది.ఈ నేపథ్యంలో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) హాజరుపరిచే అవకాశం ఉంది.

ఈ మేరకు మరో పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ( Judicial Custody ) పొడిగించాలని సీబీఐ, ఈడీ న్యాయస్థానాన్ని కోరనున్నాయి.

ఈ క్రమంలోనే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోనుంది.

విచారణ అనంతరం ఛార్జ్ షీట్ కాపీని కవితకు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆగస్టు నెలలో సక్సెస్ కొట్టాలని చూస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు…