స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన కల్కి సినిమా( Kalki 2898 movie ) విడుదలకు సరిగ్గా ఐదు వారాల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమాకు ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ ల మధ్య కల్కి మూవీ యాడ్స్ ప్రసారమవుతుండగా ఈ యాడ్స్ ప్రమోషన్స్ కోసం 4 సెకన్లకు కోటి రూపాయల చొప్పున మేకర్స్ ఖర్చు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటం వల్లే మేకర్స్ ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.

ఐపీఎల్ మ్యాచ్( IPL ) లను కనీసం 5 కోట్ల మంది చూస్తారు.ఐపీఎస్ మధ్యలో యాడ్స్ ప్రసారం కావడం వల్ల కల్కి సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఈ ప్రచారం సినిమాకు ఎంతో ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.దర్శకుడు నాగ్ అశ్విన్ ( Nag Ashwin )ఆలోచనలు ఇతర దర్శకులకు భిన్నంగా ఉంటాయని అభిమానులు వెల్లడిస్తున్నారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయి డైరెక్టర్ల రేంజ్ కు ఎదుగుతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రాజెక్ట్ కే బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.ప్రాజెక్ట్ కే సినిమాలో ఊహించని ట్విస్టులు ఉంటాయని పరిమిత పాత్రలతోనే నాగ్ అశ్విన్ అద్భుతాలు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైజయంతీ మూవీస్ బ్యానర్ లో కల్కి 2898 ఏడీ సినిమా 1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తారని భోగట్టా.త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమాలోని పాటలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.ప్రభాస్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.