నల్లజాతి ఓటర్లకు దగ్గరయ్యేలా పావులు , ఆ కాలేజ్‌కి వెళ్లిన బైడెన్.. కానీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడుతున్నారు జో బైడెన్( Joe Biden ).వయోభారం, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నా ఈ వయసులోనూ బైడెన్ యాక్టీవ్ పాలిటిక్స్ చేస్తున్నారు.

 Biden Tries To Reconnect With Black Voters, Faces Silent Protest At Morehouse Co-TeluguStop.com

డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ దక్కించుకున్న ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.అయితే తనకు దూరంగా ఉన్న వర్గాలకు దగ్గరవ్వాలని బైడెన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

ఈ నేపథ్యంలో జార్జియాలోని అట్లాంటాలో చారిత్రాత్మక బ్లాక్ యూనివర్సిటీ అయిన మోర్‌హౌస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు పాల్గొన్నారు.మోర్‌హౌస్ కాలేజ్‌( Morehouse College )లోనే దివంగత పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చదువుకున్నారు.

Telugu Black, Gaza, Jake Sullivan, Jill Biden, Joe Biden, Morehouse-Telugu NRI

బైడెన్ ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్ధులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.గాజా( Gaza )పై ఇజ్రాయెల్ దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడి వైఖరిని వారు తప్పుబట్టారు.పాలస్తీనా జెండాలను ఊపుతూ నినాదాలు చేశారు.నిరసనల మధ్యే బైడెన్ ప్రసంగించారు.శాంతియుత, అహింసాయుత నిరసనకు తాను మద్ధతు ఇస్తానని స్పష్టం చేశారు.గాజా సంఘర్షణ గురించి వివరిస్తూ.

ఇది ప్రపంచంలోని కష్టతరమైన, సంక్లిష్టమైన సమస్యలలో ఒకటన్నారు.

Telugu Black, Gaza, Jake Sullivan, Jill Biden, Joe Biden, Morehouse-Telugu NRI

నిర్ధిష్టమైన వివరాలను అందించనప్పటికీ .గాజాలో పెరుగుతున్న పౌర ప్రాణనష్టాలను పరిష్కరించాలని ప్రథమ మహిళ జిల్ బైడెన్( Jill Biden ) గతంలో అధ్యక్షుడిని కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.వివాదం కారణంగా అతని ప్రసంగాన్ని రద్దు చేయాలని కొందరు మోర్‌హౌస్ విద్యార్ధులు పిలుపునిచ్చినప్పటికీ .కార్యక్రమం నిరాటంకంగా కొనసాగింది.గాజాలో సంక్షోభాన్ని మానవతా సంక్షోభంగా అభివర్ణించిన ఆయన పోరాటాన్ని ఆపడానికీ, బందీలను స్వదేశానికి తీసుకురావడానికి తక్షణ కాల్పుల విరమణ విషయంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ( Jake Sullivan )వారాంతంలో సౌదీ అరేబియా , ఇజ్రాయెల్‌లలో పర్యటించి పరిస్ధితిని సమీక్షించారు.మోర్‌హౌస్ ప్రెసిడెంట్ డేవిడ్ థామస్ కఠినమైన సమస్యలను ఎదుర్కోవడంలో బైడెన్ సుముఖతను ప్రశంసించారు.

ఈ సమయంలో మన దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సమస్యలపై ఆయన మాట్లాడారని తెలిపారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వెలువడుతున్న ముందస్తు పోల్స్‌లో.బైడెన్‌కు నల్లజాతి ఓటర్లలో పట్టు లేదని తెలిపాయి.ఈ నేపథ్యంలో మోర్‌హౌస్‌ కాలేజ్‌కు అధ్యక్షుడు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube