అంతరిక్షంలో భారతీయుడు అందులోనూ తెలుగు వ్యక్తి కొత్త చరిత్ర లిఖించాడు.తెలుగు మూలాలున్న గోపీచంద్ తోటకూర ( Gopichand Thotakura )విజయవంతంగా రోదసియాత్ర చేశారు.
తద్వారా భారత్ నుంచి తొలి అంతరిక్ష పర్యాటకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.అంతేకాదు రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్ర చేసిన రెండవ భారతీయుడిగానూ గోపీచంద్ ఘనత వహించారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజి )న్ సంస్థ అభివృద్ధి చేసిన ‘‘న్యూషెపర్డ్-25 ’’ వ్యోమనౌక ద్వారా గోపీచంద్ అంతరిక్షంలోకి వెళ్లారు.ఆయనతో పాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికన్ వ్యాపారవేత్త కెన్నెత్ ఎల్ హెస్, కరోల్ షాలర్, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి ఎడ్ డ్వైట్‌లు కూడా రోదసిలోకి వెళ్లారు.
అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు పశ్చిమ టెక్సాస్‌లోని ప్రయోగ వేదిక నుంచి న్యూషెపర్డ్ రాకెట్( New Shepard rocket ) అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.దీని ఎగువ భాగంలో అమర్చిన ప్రత్యేక క్యాప్సూల్‌లో ఈ ఆరుగురు ప్రయాణించారు.భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కార్మాన్ రేఖ( Kármán line )ను దాటి న్యూషెపర్డ్ దూసుకెళ్లింది.
దీనిని భూ వాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దుగా స్పేస్ నిపుణులు పేర్కొంటారు.అనంతరం వ్యోమనౌకలోని ఆరుగురు కొద్దిసేపు భారరహిత స్ధితిని అనుభవించి, అంతరిక్ష అందాలను వీక్షించారు.తర్వాత పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ నేలపైకి దిగింది.
కాగా.రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా గతంలో స్పేస్‌లోకి వెళ్లినవారే.అయితే వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.
కానీ గోపీచంద్ విషయానికి వస్తే.ఆయన ప్రస్తుతం అగ్రరాజ్యంలో వుంటున్నప్పటికీ భారత పాస్‌పోర్ట్ కలిగివున్నారు.
విజయవాడలోనే గోపీచంద్ పుట్టారు.ప్రస్తుతం ప్రిజర్వ్ లైఫ్ సంస్థ కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు.
అట్లాంటా కేంద్రంగా వెల్‌నెస్ సెంటర్‌గా ఈ సంస్థ సేవలందిస్తోంది.గోపీచంద్ ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ( Embry-Riddle Aeronautical University ) నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు.
గతంలో మనదేశంలోనే మెడికల్ ఎయిర్ ఎవాక్యుయేషన్ రంగంలో పనిచేశారు.అలాగే పైలట్‌గానూ గోపీచంద్ శిక్షణ తీసుకున్నారు.