నైరుతి రుతుపవనాలు( South West Monsoon ) చురుగ్గా కదులుతున్నాయి.ఈ మేరకు ఈ నెల 31న నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయి.
తరువాత వారం రోజుల్లో ఏపీకి రుతుపవనాలు చేరుకోనున్నాయి.రుతు పవనాల నేపథ్యంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Meteorological Department ) అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ నెల 22 న బంగాళాఖాతంలో( Bay Of Bengal ) అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు.ఇది 24వ తేదీన బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
ద్రోణి, ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు( Rains ) పడనున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మరో రెండు రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.