ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ( Ebrahim Raisi ) మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.ఇరాన్.
భారత్ దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.అంతర్జాతీయ పరంగా కొన్ని విషయాలలో అనేకమార్లు ఇరాన్ దేశానికి భారత్ అండగా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఇబ్రహీం రైసీ మృతి కారణంగా భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది.రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.
ఇబ్రహీం రైసీ మృతి పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి.వాతావరణం లేదా పైలెట్ పొరపాటు కారణంగా.ఈ ఘోరం జరిగిందా అన్నది ఎవరికి అర్థం కావటం లేదు.
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు కూడా బయలుదేరాయి.అవి సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
కానీ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఆల్రెడీ గత కొన్ని వారాల నుండి ఇరాన్.
ఇజ్రాయెల్( Israel ) దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఇరాన్ కొన్ని రాకెట్లను కూడా ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడటం జరిగింది.
ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మరణించడంతో…ఇజ్రాయెల్ పై అనుమానాలు నెలకొన్నాయి.ఇబ్రహీం రైసీ మృతికి కారణం ఇజ్రాయెల్ గూడచార సంస్థ మోసాద్ అయ్యుండొచ్చని కామెంట్లు వస్తున్నాయి.
మరోపక్క ఇరాన్ అధ్యక్షుడు మరణానికి తమకి ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేయడం జరిగింది.