అదే జరిగితే కేటీఆర్ పరిస్థితేంటీ ? 

ఒకప్పుడు తెలంగాణ అధికార పార్టీగా పెత్తనం చేలయించిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు గంధర గోళం గా మారింది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం,  కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.

 If That Happens, What Will Happen To Ktr, Kcr, Rakesh Reddy Anugula, Ktr,telanga-TeluguStop.com

ఇక ఇటీవల 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ గట్టి పయత్నాలు చేసింది.

ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది.ప్రస్తుతం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్  కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఈ ఎన్నికల బాధ్యతలను ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీసుకున్నారు.  సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ను గెలిపించుకోవడం కేటీఆర్ కు ఇప్పుడు అతిపెద్ద సవాల్ గ మారింది.

Telugu Brs, Mlacandi, Rakeshreddy, Telangana, Telangana Mlc-Politics

 అంతేకాదు కేటీఆర్ నాయకత్వానికి ఇది పరీక్షగా మారనుంది.ఈ ఎన్నికల్లో విజయం సాధించడం బీఆర్ఎస్ కు అంత సులువేమీ కాదు ప్రస్తుతం బిఆర్ఎస్ ఎన్నో ఇబ్బందికర పరిస్తితులు ఎదుర్కొంటుంది.నిరుద్యోగులు యువత టిఆర్ఎస్ పై ఎప్పటికీ ఆగ్రహంతోనే ఉన్నారు అయినా ఈ సెట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటామనే నమ్మకంతో కేటీఆర్ ఉన్నా, ఇప్పటికే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా కనిపించలేదనే విశ్లేషణలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ప్రతిష్టాత్మకంగా మారింది.  ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే బిఆర్ఎస్ లో ఊపు కనిపిస్తుంది.

వాటిని చెందితే మరింతగా పార్టీ ప్రతిష్ట దిగజారుతుంది.

Telugu Brs, Mlacandi, Rakeshreddy, Telangana, Telangana Mlc-Politics

బీ ఆర్ ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు .ఆయన్ను గెలిపించే బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు.అయితే ఆ బాధ్యతలను కేటీఆర్ కు బదులుగా హరీష్ రావుకు అప్పగించాలనే డిమాండ్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలిస్తేనే కేటీఆర్ హవా తో పాటు , బీఆర్ఎస్ పరువు నిలబడుతుంది.లేదంటే ముందు ముందు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube