తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటికే శివ డైరెక్షన్ లో కంగువ( Kanguva ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.అయితే కార్తీక్ సుబ్బరాజ్ కి పెద్దగా సక్సెస్ అయితే లేవు.
ఇక రీసెంట్ గా వచ్చిన డబుల్ ఎక్స్ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య అభిమానులు కార్తీక్ సుబ్బరాజు( Karthik subbaraju )తో సూర్య ఎందుకు సినిమా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.అయితే కార్తీక్ సుబ్బరాజ్ తో సూర్య ఇంతకుముందే సినిమా చేస్తానని మాట ఇచ్చారట.దానికి అనుకూలంగా ఇప్పుడు తనతో సినిమా చేయడానికి టైం దొరికింది కాబట్టి ఇప్పుడు సినిమా చేస్తున్నాడు.
కేవలం మాట ఇచ్చినందుకే సినిమా చేస్తున్నాడు తప్ప కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్యకి పూర్తిగా నమ్మకం అయితే లేదు అని కూడా మరి కొంతమంది అంటున్నారు.ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదంటే చతికులపడిపోతుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే కంగువ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుకున్న సమాచారం ప్రకారం సూర్య భారీ సక్సెస్ ను సాధించబోతున్నట్టుగా కూడా సినిమా యూనిట్ అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.