పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో పన్నీర్ ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ పన్నీర్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
పన్నీర్ తో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.పన్నీరు లో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్ బి12, విటమిన్ బి9 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యానికి పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అయితే ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.పన్నీర్ ను కొందరు మాత్రం తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ కొందరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో కొందరు తరచూ గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం (Gas, acidity, constipation)వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు.
అలాంటి వారు పన్నీర్ ను ఎవైడ్ చేయడమే ఉత్తమం.ఎందుకంటే పన్నీర్ లో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి.
అందువల్ల పన్నీర్ త్వరగా డైజెస్ట్ అవదు.దీని కారణంగా జీర్ణ వ్యవస్థ పై ఒత్తిడి పెరుగుతుంది.
ఫలితంగా జీర్ణ సమస్యలు రెట్టింపు అవుతాయి.
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు పన్నీర్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే బాడీలో కొలెస్ట్రాల్ పెంచే ఆహారాల్లో పన్నీర్ కూడా ఒకటి.కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
అలాగే కొందరికి మిల్క్ అలర్జీ ఉంటుంది.అయితే అలాంటి వారికి పన్నీర్ కూడా పడకపోవచ్చు.
పన్నీర్ తిన్న తర్వాత వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలను ఫేస్ చేస్తే కనుక వెంటనే తినడం ఆపేయండి.
ఇక ఎవ్వరైనా సరే పన్నీర్ ను నిత్యం తీసుకోవడం ప్రమాదకరం.అధికంగా పన్నీర్ తినేవారు త్వరగా బరువు పెరుగుతారు.పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఇది ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.అధిక కాల్షియం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తుంది.
ఒకవేళ ఆల్రెడీ మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే పన్నీర్ ను తినకపోవడమే మంచిది.