తెలంగాణ కేబినెట్ సమావేశం( Telangana Cabinet Meeting ) ఇవాళ జరగనుంది.మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది.
అయితే తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం( Election Commission ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.అయితే ఈ భేటీలో రైతు రుణమాఫీ, విభజన సమస్యలపై చర్చించవద్దని ఈసీ తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
ఇందులో ప్రధానంగా అకాల వర్షాలు, పంట నష్టంతో పాటు కొనుగోలు కేంద్రాలపై కేబినెట్ చర్చించనుంది.
దాంతోపాటుగా వానాకాలం పంట ప్రణాళికపైనా చర్చించే అవకాశం ఉంది.అదేవిధంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే మార్గాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించింది.