అట్లాంటిక్ సముద్రం కింద 93 రోజులు గడిపిన వ్యక్తి.. వయసు తగ్గాడుగా..?

రిటైర్డ్ నేవి ఆఫీసర్ జోసెఫ్ దితురి( Joseph Dituri ) ఒక అద్భుతం సృష్టించారు.ఆయన ఇటీవల ఓ విశేషమైన సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంటల్ సవాలును స్వీకరించారు.

 A Person Who Spent 93 Days Under The Atlantic Ocean, Scientific Study, Retired N-TeluguStop.com

మూడు నెలలకు పైగా ఆయన నీటి అడుగున నివసించారు.తద్వారా ఒత్తిడి గల నీటి అడుగు ప్రదేశాలు మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయం చేశారు.ఇది సామాన్యమైన విషయం కాదు; దితురి అట్లాంటిక్ మహాసముద్రంలో లోతుగా ఉన్న ఒక చిన్న పాడ్‌లో ఉండి, పై ప్రపంచం నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాడు.

93 రోజుల నివాసం తర్వాత దితురి సముద్రపు అడుగున నుండి బయటకు వచ్చినపుడు, ఆయన శరీరంలోని మార్పు చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు.దితురి పదేళ్ల వయసు తగ్గినట్లుగా కనిపించాడని, వృద్ధాప్య ప్రక్రియ తిరోగమనం చెందినట్లుగా అనిపించిందని వారు కనుగొన్నారు.ముఖ్యంగా టెలోమియర్‌లలో మార్పు ఎక్కువగా కనిపించింది. టెలోమియర్లు మన డీఎన్‌ఏ తంతువుల చివర్లలో ఉండే రక్షిత టోపీలు లాంటివి.మనం వృద్ధాప్యం చెందుతున్న కొద్దీ ఈ టెలోమియర్‌లు చిన్నవి అతుంటాయి, కానీ దితురి టెలోమియర్‌లు అద్భుతంగా 20 శాతం పెరిగాయి.

ఇది కణ స్థాయిలో పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతం.

Telugu Atlantic Ocean, Joseph Dituri, Nri, Retired Naval, Scientific-Telugu NRI

దితురి శరీరంలో ఆశ్చర్యపరిచే మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.మన కణజాలాలను పునరుద్ధరించడానికి, మరమ్మత్తు చేయడానికి అవసరమైన స్టెమ్ సెల్స్ ఉత్పత్తిని దితురి శరీరం పెంచింది.ఫలితంగా ఆయన ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది.

ఆయనకు గతంలో కంటే మంచి నిద్ర పట్టింది, కొలెస్ట్రాల్ స్థాయిలు 72 పాయింట్లు తగ్గాయి, రక్తంలో ఇన్‌ఫ్లమేషన్‌ను సూచించే గుర్తులు సగానికి తగ్గాయి.ఈ సానుకూల మార్పులకు నీటి అడుగున ఉన్న అధిక పీడనం కారణమని డాక్టర్లు భావిస్తున్నారు.

ఇలాంటి అనుభవం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ కూడా ఉపయోగపడతాయని దితురి స్వయంగా చెప్పారు.రోజువారీ జీవితంలోని హడావిడి నుంచి దూరంగా, ఇలాంటి పీడనం గల వాతావరణంలో గడపడం చికిత్సాపరంగా ఉపయోగపడుతుందని ఆయన సూచించారు.

దీన్ని ఓ విధమైన “హైపర్బారిక్ వెకేషన్”(hyperbaric vacation)గా ఆయన ఊహించారు, ఇక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకుని, ప్రత్యేక పరిస్థితుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.

Telugu Atlantic Ocean, Joseph Dituri, Nri, Retired Naval, Scientific-Telugu NRI

సముద్రపు అడుగున ఉన్న సమయంలో, దితురి కఠినమైన వ్యాయామ పద్ధతిని పాటించాడు.వారానికి ఐదు రోజులు, ఒక గంటకు పైగా ఎలాస్టిక్ బ్యాండ్లను ఉపయోగించి వ్యాయామం చేశాడు.ఈ క్రమశిక్షణ ఆయన మెరుగైన జీవక్రియకు దోహదపడిందని భావిస్తున్నారు, ఇది ఆయన ఆరోగ్యంలో చెప్పుకోదగిన మరొక మెరుగుదల.దితురి సైంటిస్టులకు సహకరించడమే కాకుండా, వ్యక్తిగత ఆరోగ్య ప్రయోజనాలను పొందడమే కాకుండా, ఒక కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.93 రోజుల పాటు నీటి అడుగున నివసించడం ద్వారా, ఆయన 73 రోజుల పాత రికార్డును బద్దలు కొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube