బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ కామెంట్స్ వైరల్!

బెంగళూరు రేవ్ పార్టీ( Rave Party )లో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీల పోలీసులకు పట్టుబడిన సంగతి మనకు తెలిసిందే.ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఒక ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పార్టీ జరుపుకున్నారు.

 Actress Hema React On Benguluru Reve Party, Hema, Benguluru, Rave Party, Tollyw-TeluguStop.com

ఈ పార్టీలో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారని తెలుస్తోంది.ఇలా ఈ ఫామ్ హౌస్ లో పుట్టిన రోజు వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నారనే విషయం తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు.

ఈ వేడుకలలో సుమారు వందమంది వరకు పాల్గొనడమే కాకుండా భారీ స్థాయిలో డ్రగ్స్( Drugs ) ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.ఇక ఈ పార్టీలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తోంది.ఇక ఈ పార్టీలో భాగంగా సినీనటి హేమ ( Hema ) కూడా ఉన్నారని సమాచారం.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న హేమ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే పార్టీలో భాగంగా ఈమె కూడా ఉన్నారనే వార్తలు రావడంతో ఆమె వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాను బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో లేనని నా గురించి వస్తున్నటువంటి వార్తలు అన్ని పూర్తిగా ఆవాస్తవమని తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాదులో తన ఫామ్ హౌస్ లో ఉన్నానని తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.దీంతో ఈ వార్తలకు చెక్ పడింది.ఇక పార్టీకి అటెండ్ అయినటువంటి వారందరిని అరెస్టు చేయడమే కాకుండా వారందరి వాహనాలను కూడా సీజ్ చేశారని తెలుస్తుంది అలాగే పెద్ద ఎత్తున మారకద్రవ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube