ఏపీలో పోలింగ్( AP Polling ) ముగిసిన అనంతరం చోటు చేసుకున్న అల్లర్లపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) నివేదిక సిద్ధం చేస్తుంది.ఈ మేరకు ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్( SIT Chief Vineet Brij Lal ) సాయంత్రం డీజీపీకి అందించనున్నారు.
కాగా ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతంలో కేసుల విచారణపై సిట్ సమీక్ష పూర్తి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసుల విచారణపై సిట్ ( SIT ) పర్యవేక్షణ కొనసాగించనుంది.
అయితే రెండు రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోయిన నేపథ్యంలో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ అధికారులు డీజీపీని ( DGP ) కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతారు.
ఈ క్రమంలో సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.