తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటీనటులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటంలో చిరంజీవి( Chiranjeevi ) ఎప్పుడు ముందుంటారు.ఈ క్రమంలో నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావటంతో.సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశారు.“కలలు అందరికీ ఉంటాయి.అవి నిజం చేసుకునేందుకు కృషి కొందరే చేస్తారు.కళా రంగంలో అలాంటి నిత్యకృషివలుడు తారక్ కి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ ఇంకా చాలామంది సినిమా నటులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR birthday ) సందర్భంగా ఆయన చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి సంబంధిత సినిమా యూనిట్ అప్ డేట్ లు ఇవ్వటం జరిగింది.కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా( Devara movie) నుండి సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది.అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలుకానున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది.
ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదే సమయంలో అభిమానులు కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఎన్టీఆర్ ఫోటోలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేయడం జరిగింది.