టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు దర్శకులుగా మారి ఆకట్టుకున్నారు అలాంటి వారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన నిర్మాత దర్శకుడు యు.విశ్వేశ్వరరావు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పొలిటికల్ సినిమాలు తీసిన నిర్మాత దర్శకుడిగా ఆయన పేరుందారు. ఉప్పలపాటి విశ్వేశ్వరరావు( U Visweswara Rao ) నిమ్మకూరులో జన్మించారు.
సినిమాలంటే ఆసక్తి ఉండేది.అందువల్ల ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ప్రారంభించారు మొదటగా పి.పుల్లయ్య దగ్గర కన్యాశుల్కం చిత్రానికి రాయ దర్శకుడిగా పని చేశారు.
కొన్ని నెల తర్వాత డబ్బింగ్ చిత్రాల తెలుగువారికి తెలుగులో అందించాలని తపన పడ్డారు.మరో ఆలోచన లేకుండా బాలనాగమ్మ, విప్లవ స్త్రీ వంటి చిత్రాలు తెలుగులో డబ్ చేశారు.అవి సూపర్ హిట్ అయ్యాయి.
తన మేనకోడలు పద్మిని సలహాతో తన ఫిలిం ప్రొడక్షన్ సంస్థకు విశ్వశాంతి అని పేరు పెట్టారు.అలా విశ్వేశ్వరరావు ప్రొడ్యూసర్ అయ్యారు.“కంచుకోట” మూవీ( Kanchu Kota )ని నిర్మించి స్ట్రెయిట్ ప్రొడ్యూసర్‌గా మారారు.నిర్మాతకు ముందు జానపద సినిమాలు అంటే చాలామంది ఏ మంత్రాలు తంత్రాలు మాత్రమే చూపించేవారు.
కానీ ఆయన మాత్రం జానపదమంటే మంత్రాలు తంత్రాలు మాత్రమే పరిమితం కాకూడదని భావించేవారు.జానపదమంటే రాజకీయాలు అని కూడా ఆయన నమ్మేవారు, అదే తన సినిమాల్లో చూపించారు.
అయితే అంతకుముందు జయసింహ, బందిపోటు సినిమాల్లో రాజకీయాల గురించి చర్చించారు.వీటిని వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు.
వాటిని చూడటం ద్వారా విశ్వేశ్వర రావు నమ్మకంతో చాలా మంచి సినిమాలు తీశారు.టెక్నికల్ గా హై వ్యాల్యూస్ ఉండేలా చూసుకున్నారు ఉదాహరణకి కంచుకోట.
ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఎన్.టి.ఆర్ కు ప్రజానాయకుడి ఇమేజ్ తెచ్చిన సినిమాలు అన్నీ కూడా విశ్వేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించినవే కావడం విశేషం.ఈ దర్శక నిర్మాత తన సినిమాల్లో రాజకీయాల గురించి బలంగా విమర్శించేవారు.నందమూరి తారకరామారావు విశ్వేశ్వరరావు బాగా పరిచయం కావడంతో అతని అమ్మాయితో తన కుమారుడి పెళ్లి చేశారు.
విశ్వేశ్వరరావు కోవిడ్ బారిన పడి మరణించారు.అయితే ఆయన తీసిన మార్పు (1978) అనే సినిమా సినిమాలో రామోజీరావు( Ramoji Rao ) ఒక న్యాయమూర్తి పాత్రలో నటించే ఆకట్టుకున్నారు.
అలా ఎన్టీఆర్ వియ్యంకుడు సినిమాలో రామోజీరావు నటించడం జరిగింది.ఇంటర్నేషనల్ బ్యానర్ కింద ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేశారు.