మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తే .వైసీపీకి( YCP ) కూటమి పార్టీలకు మధ్య హోరాహోరీగా పోరు నడిచినట్టే కనిపించింది.
ఖచ్చితంగా గెలిచేది తామే అంటూ గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో వచ్చిన 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటాము అన్న ధీమాలో వైసీపీ ఉండగా.
తమ మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్న ధీమాను కూటమి పార్టీలు అవలంబిస్తున్నాయి.అయితే ఖచ్చితం గా ఎవరు అధికార పీఠాన్ని దక్కించుకుంటారు అనేది మాత్రం జనాలకు క్లారిటీ రావడం లేదు.
జూన్ 4 వ తేది వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనుంది.

అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీలైన బిజెపి, టిడిపి, జనసేన లు( BJP TDP Janasena ) విజయోత్సవ సభలు, ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాలు నిర్ణయించేసుకుంటున్నాయి.తాజాగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ రాజకీయ వ్యవహారాలపై స్పందించారు.ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్ కు ఢిల్లీలో ఇంటర్వూ ఇచ్చారు.
ఈ సందర్భంగా దేశ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయ వ్యవహారాలపైనా ఆయన స్పందించారు.ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఘోర పరాజయం ఎదురవుతుందని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.
తాము కచ్చితంగా గెలిచి అధికారాన్ని చేపడతామని సీఎం జగన్( CM Jagan ) చెప్పినా ఫలితం ఉండదు అని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.

జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటి వారు చెబుతున్నారని , వారి పార్టీలు ఎన్నికల్లో గెలవబోవని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ గతం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని చెబుతున్నారని, అది సాధ్యమయ్యే పని కాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.దేశంలో బిజెపి ( BJP ) మరోసారి అధికారంలో రాబోతోంది అని అన్నారు.
దేశంలో మోదీ, బిజెపిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అయితే ఆగ్రహం మాత్రం కనిపించడం లేదని, గతం కంటే ఎక్కువ స్థానాలను బిజెపి గెలుచుకునే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.