ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెంచారు.ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా మంది ప్రజలకి అర్థమయిపోయింది.
సాధారణంగా చిన్న వయస్సు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు కొంత మందికి గాయాలు అవుతూ ఉంటాయి.ఇలాంటి కొన్ని గాయాలు కొంత మంది ప్రజలలో అంత త్వరగా మానవు.
అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం బారిన పడిన వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గుతూ ఉంటుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటుంది.దీని కారణంగా గాయాలు త్వరగా మనవు.అలాగే గాయ పడిన వ్యక్తి శరీరంలో సోడియం అధికంగా పెరిగితే గాయం త్వరగా మనదు.పైగా గాయం చుట్టు పక్కల పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద వయసు వారిలో గాయాలు త్వరగా మనవు.పెరుగుతున్న వయసు కారణంగా చర్మం నెమ్మదిగా రికవరీ అవుతుంది.
దీని కారణంగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎవరైనా అధిక ధూమపానం చేసినప్పుడు శరీరంలో నికోటిన్ మొత్తం పెరుగుతూ ఉంటుంది.
దీని కారణంగా గాయం త్వరగా నయం అయ్యే అవకాశం ఉండదు.
శరీరంలో జింక్ వంటి ముఖ్యమైన పోషకల లోపం ఉన్నప్పుడు కూడా గాయలు త్వరగా నయం కావు.ఇంకా చెప్పాలంటే గాయమైన వ్యక్తి తన ఆహారంలో జింక్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గాయం త్వరగా మానుతుంది.అయితే గాయం త్వరగా మనకపోయినా ఆ సందర్భాలలో వైద్యులను సంప్రదించడం మంచిది.
కాబట్టి ఎక్కువ వయసు కలిగి ఉన్నవారు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ వ్యాధి ఉన్నవారు చిన్న గాయమైన, అది నయం అయ్యేవరకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.