బెంగళూరు రేవ్ పార్టీ ( Bengaluru rave party)వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు బర్త్ డే సెలబ్రేషన్స్( Birthday Celebrations ) పేరిట నిర్వహించిన రేవ్ పార్టీలో సుమారు 101 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ పార్టీలో 30 మంది యువతులతో పాటు 71 మంది పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు.మరోవైపు బెంగళూరు పోలీస్ స్టేషన్ వద్దకు మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి.
ఈ క్రమంలోనే అందరి నుంచి మెడికల్ సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారని సమాచారం.కాగా రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అదేవిధంగా నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారని తెలుస్తోంది.ఉదయం వీడియో రిలీజ్ చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మిస్ లీడ్ చేసిన హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.







