సూర్యాపేట జిల్లా:ప్రస్తుత వానాకాలం 2023-24 సీజన్ కు సంబంధించి రైతులకు ఈ నెల 26 నుండి రైతుబంధు సాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( S.Venkatarao ) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా 2,89,172 మంది రైతులకు రూ.317.28 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.జిల్లాలో 2023 జూన్ 18 నాటికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు అలాగే ఆన్లైన్ ధరణిలో డిఎస్ అయిన వారు, ఒక్కసారి కూడా రైతు బంధుకు ధరఖాస్తు చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే వానాకాలం రైతుబంధు పథకానికి సంబంధించిన వివరాలను సంబంధిత ఏఈఓలకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రైతు బందులో ఏమైనా సమస్యలు ఉంటే మండల వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు.




Latest Suryapet News