హుజూర్ నగర్ మండల వాసికి డాక్టరేట్ ప్రధానం

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సిహెచ్.జ్యోతి( Ch.

 Doctorate Is Preferred For A Resident Of Huzur Nagar Mandal , Mahatma Gandhi Uni-TeluguStop.com

Jyoti ) తండ్రి రాయప్పకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది.నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (పానగల్లు) యందు ఎంబీఏ అభ్యసించి,2010 నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అదే విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ అధ్యాపకురాలుగా సేవలందిస్తున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అధ్యాపకురాలు ఆచార్య సి.వి.రంజిని పర్యవేక్షణలో “నల్లగొండ జిల్లా పోలీసుల్లో వృత్తిపరమైన స్వీయ ఒత్తిడి-అవగాహన” అనే అంశంపై పరిశోధించి పరిశోధన పత్రాన్ని సమర్పించినందుకు గాను ఆమె ఈ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం( Mahatma Gandhi University ) తన పరిశోధనలో సివిల్, స్పెషల్ పోలీస్ మరియు ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందితో వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన ఒత్తిడి దాని యొక్క ప్రభావo, అధిగమించేందుకు వారు ఎంచుకునే ప్రత్యామ్నాయాల వంటి అంశాలను పరిశీలించారు.

సివిల్ పోలీసులు అత్యధికంగా పని స్వభావంతో ఒత్తిడికి గురవుతున్నట్లు,వారితో పోల్చినప్పుడు స్పెషల్ మరియు ఆర్ముడు పోలీసులు నిర్దేశిత సమయాల్లో సహచరులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడం వారిని ఒత్తిడికి దూరం చేస్తుందని తేలిందన్నారు.సిబ్బంది కొరత,పని భారం,శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో డ్యూటీలు, ఒత్తిడికి కారణాలుగా గుర్తించారు.

పోలీసుల యొక్క మానసిక ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో కౌన్సిలర్ల నియామకాలు,సమస్య ఆధారిత పరిష్కార మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చునని తెలిపారు.ఈ సందర్భంగా మేనేజ్మెంట్ అధ్యాపకులు ఆచార్య అల్వాల రవి, ఆచార్య సరిత,డాక్టర్ శ్రీలక్ష్మి,డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ సబీనా హెరాల్డ్, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube