ప్రభుత్వ బడిలో చదివి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామానికి చెందిన బంగారు సుధాకరచారి,రాధిక దంపతుల కుమారుడు బంగారు శివాజీ ఇటివల విడుదలైన టీపీబిఓ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సియర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 11వ,ర్యాంక్,మరియు జోనల్ స్థాయిలో 3వ,ర్యాంక్ సాధించి టీపిబిఓ ఉద్యోగాన్ని సాధించాడు.అలాగే శుక్రవారం విడుదలైన ఏఈ ఫలితాలలో ఇరిగేషన్ ఏఈగా సెలెక్ట్ అయ్యాడు.

 Bangaru Shivaji Studied In A Government School And Got 2 Government Jobs In Sury-TeluguStop.com

ఇలా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బంగారు శివాజీ 1నుండి 7వ,తరగతి వరకు పొట్లపహాడ్ ప్రాధమిక ఉన్నత పాఠశాలలో,8 నుండి 10వ, తరగతి వరకు అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదివాడు.

ఇలా గవర్నమెంట్ స్కూల్ లో చదివి 2014 సంవత్సరం పదవ తరగతిలో 10/10 సాధించి,మేధా నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణుడయ్యి ఇంటర్ శ్రీచైతన్య కాలేజీలో,బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాసవి కాలేజీలో చదివి తన స్వశక్తితో కష్టపడి చదివి పోటీ పరీక్షలకి సిద్ధమై ఇప్పుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి తల్లితండ్రుల కష్టాన్ని గుర్తించి ఇష్టంతో చదివి ఉన్నత ఉద్యోగం సాధించిన శివాజీకి తల్లిదండ్రులు,బంధువులు,స్నేహితులు,గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube