నల్లటి పొడవాటి కురులు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.అందుకే అటువంటి హెయిర్ కోసం ( Hair )మగువలు తహతహలాడుతుంటారు.
అయితే ఇటీవల రోజుల్లో పోషకాల కొరత, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల చాలా మంది జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది.ఈ జాబితాలో మీరు ఉండకూడదంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను మీరు వాడాల్సిందే.
వారానికి కేవలం రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే మీ జుట్టు ఎప్పటికి నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద ఆకుని( Aloe vera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవనూనె ( Mustard oil )వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, గుప్పెడు గోరింటాకు ఆకులు, నాలుగు రెబ్బలు కరివేపాకు ( Curry leaves )వేసుకొని చిన్న మంటపై ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార పెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ మ్యాజికల్ ఆయిల్ ను తలకు రాసుకుని మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే వైట్ హెయిర్ అన్న సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు.
మీ జుట్టు ఎప్పటికి నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.ఈ ఆయిల్ ను వాడటం స్టార్ట్ చేశారంటే మీ జుట్టు కొద్దిరోజుల్లోనే డబుల్ అవుతుంది.
మరియు చుండ్రు సమస్య( Dandruff problem ) ఉన్న కూడా దూరం అవుతుంది.