హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ వాడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

నేటి అధునిక కాలంలో దాదాపు అమ్మాయిలంద‌రూ హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ ను విరి విరిగా వాడేస్తున్నారు.జుట్టును క‌ర్లీగా, సాఫ్ట్‌గా, ర‌ఫ్‌గా.

 Here Are The Best Tips For Those Who Use Hair Styling Tools , Hair Styling Tools-TeluguStop.com

ఇలా ఎలా ప‌డితే అలా ఎప్పుడు ప‌డితే అప్పుడు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు తీర్చిదిద్దుకుంటున్నారు.అయితే హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ వాడ‌టం వ‌ల్ల జుట్టు తాత్కాలికంగా అందంగానే క‌నిపిస్తుంది.

కానీ, ఆయా టూల్స్ వ‌ల్ల వెలువ‌డే వేడి కార‌ణంగా జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.ఈ క్ర‌మంలోనే జుట్టు రాలిపోవ‌డం, పొట్లిపోవ‌డం, విరిగిపోవ‌డం వంటివి జ‌రుగుతాయి.

అయితే ఈ స‌మ‌స్య‌ల నుంచి కొంత‌లో కొంతైన త‌ప్పించుకోవాల‌నుకుంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ ను వాడే వారు మంచి నాణ్య‌మైన సీర‌మ్‌ను త‌ర‌చూ జుట్టుకు వాడుతుండాలి.సీర‌మ్‌ను అప్లై చేయ‌డం వ‌ల్ల.హెయిర్ డ్యామేజ్ అవ్వ‌డం, బ్రేక్ అవ్వ‌డం, స్ప్లిట్ అవ్వ‌డం వంటివి త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే వారంలో ఖ‌చ్చితంగా రెండు సార్లు హెయిర్ మాస్క్‌ను వేసుకోవాలి.

అందు కోసం బాగా పండిన ఒక అర‌టి పండును తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఆ త‌ర్వాత అందులో నాలుగైదు స్పూన్ల నువ్వుల నూనె వేసి మిక్స్ చేయాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి గంట అనంత‌రం త‌ల స్నానం చేయాలి.హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ వ‌ల్ల డ్యామేజ్ అయిన జుట్టును ఈ మాస్క్ మ‌ళ్లీ రిపేర్ చేస్తుంది.

ఇక హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను వాడినా జుట్టు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.కొబ్బ‌రి నూనెతో త‌ర‌చూ హెయిర్ మసాజ్ చేసుకోవాలి.జుట్టు చివ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు క‌త్తిరించుకోవాలి.మ‌రియు కెమిక‌ల్స్ లేని షాంపూల‌నే వాడాలి.

Here Are The Best Tips For Those Who Use Hair Styling Tools , Hair Styling Tools , Latest News , Hair Care , Hair Care Tips , Beauty , Beauty Tips , Healthy Hair , Falling , Cracking , Breaking - Telugu Tips, Care, Care Tips, Tools, Healthy, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube