కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆమె కు నిన్న మొన్నటి వరకూ పోటీగా ఉన్న కొందరు హీరోయిన్స్ వరుసగా ప్లాప్ ల వల్ల కనిపించకుండా పోతున్నారు.
మెల్ల మెల్లగా వారికి అవకాశాలు తగ్గుతున్నాయి.కానీ రష్మిక మందన మాత్రం పుష్ప సినిమా తో మరో సారి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
పుష్ప సినిమా లో శ్రీవల్లి పాత్రలో ఆమె కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.అంతే కాకుండా సామి సామి అనే పాట కు ఆమె వేసిన డాన్స్ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది.
అందుకే రష్మిక మందన టాలీవుడ్ లో నెంబర్ వన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నెంబర్ వన్ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి సరిగ్గా నాలుగు సంవత్సరాలు అయింది.
నాగ శౌర్య హీరో గా వెంకీ కుడుముల దర్శకత్వం లో రూపొందిన ఛలో అనే సినిమా తో ఈమె హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే.మొదటి సినిమా తోనే సక్సెస్ ని దక్కించుకున్న ఈ అమ్మడు ఆ వెంటనే విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం అనే సినిమా లో నటించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఆ సినిమా తర్వాత రష్మిక మందన వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

నాలుగేళ్ల నుండి వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా మంచి పాత్రలను కమిట్ అవుతూ సినిమా సినిమా కు గుర్తింపు దక్కించుకుంది.కేవలం తెలుగు లోనే కాకుండా తన సొంత భాష కన్నడం మరియు తమిళం హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.నాలుగు భాషల్లో సమాంతరంగా సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్ గా ఈ అమ్మడు నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ అమ్మడు మరో పది సంవత్సరాల పాటు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.