సూర్యాపేట జిల్లా:శిథిలావస్థకు చేరుకున్న ఆసుపత్రి భవనం,ఊడిపడుతున్న స్లాబ్ పెచ్చులు, భయాందోళనలకు గురవుతున్న రోగులు,వైద్యసిబ్బంది ఇదీ సూర్యాపేట జిల్లాలో ఓ పి హెచ్ సి పరిస్థితి.తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల దశదిశా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయా? అనంతగిరి మండలం త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితిని చూస్తే నిజమే అనిపిస్తుంది.ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన ధర్మాసుపత్రుల నిర్వహణ తీరు అగమ్యగోచరంగా మారింది.జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు,నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు,మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రుల సంగతి దేవుడెరుగు?కనీసం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పట్టించుకోక పోతే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పై పెచ్చులు ఊడి పడుతున్నా పట్టించుకోవడం లేదని, ఎప్పుడు ఎవరి మీద పడతాయోననే భయంతో రోగులు,వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి త్రిపురారం పి హెచ్ సీ కి చేసిన అనారోగ్యానికి మందులు వేసి కాపాడవల్సిందిగా కోరుతున్నారు.




Latest Suryapet News