సూర్యాపేట జిల్లా:మునగాల మోడల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఔదార్యం చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఈ నెల 11 అర్థరాత్రి మునగాల మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరియు గాయపడి చికిత్స పొందుతున్న తోటి విద్యార్థిని,విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆ లేత మనసులు ముందుకు రాగా,వారిని చూసి పాఠశాల ఉపాధ్యాయ బృందం కూడా తమ వంతుగా స్పందించారు.అందరూ కలిసి ఆపదలో ఉన్నవారికి రూ.65 వేల ఆర్ధిక సహాయం చేసి మేమున్నామనే భరోసా ఇచ్చారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంసభ్యులకు రూ.20 వేలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల మునగాల ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి,సర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఎస్ఎంసీ చైర్మన్ ఉడుం కరుణ కృష్ణ మరియు ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని,విద్యార్ధులు పాల్గొన్నారు.
Latest Suryapet News