ఈ 4 రకాల ఆహారాలు డైట్ లో ఉంటే మీ మెదడు మెరుపు వేగంతో పనిచేస్తుంది!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు టైమ్‌ తో పాటే పరుగులు పెడుతున్నారు.ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మెదడు ఎంత వేగంగా పనిచేసే అంతా వేగంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలము.

 4 Superfoods For Brain Health , Brain Health, Brain, Healthy Brain , Sha-TeluguStop.com

అందుకే మెదడు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.బ్రెయిన్ షార్ప్ గా మార్చే ఆహారాలను తీసుకునేందుకు ప్రయత్నించాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే నాలుగు రకాల ఆహారాలు బ్రెయిన్ హెల్త్( Brain Health ) కు ఎంతో మేలు చేస్తాయి.వీటిని డైట్ లో చేర్చుకుంటే మీ మెదడు మెరుపు వేగంతో పనిచేస్తుంది.

మరి ఇంతకీ ఆ నాలుగు రకాల ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Avocado, Brain, Brainbooster, Tips, Healthy Brain, Nuts, Strawberry, Food

స్ట్రాబెర్రీస్..( Strawberries ) ప్రస్తుత చలికాలంలో విరివిరిగా దొరికే పండ్లలో ఒకటి.

చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే స్ట్రాబెర్రీస్ అనేక పోషకాలను సైతం కలిగి ఉంటాయి.వీటిలో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

ఇది ఒత్తిడిని చిత్తు చేసి జ్ఞాపక శక్తిని( Memory power) పెంచ‌డానికి అద్భుతంగా సహాయపడుతుంది.రోజుకు రెండు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుంటే మెదడు షార్ప్ గా మారుతుంది.

Telugu Avocado, Brain, Brainbooster, Tips, Healthy Brain, Nuts, Strawberry, Food

అలాగే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పసుపు ( Turmeric )ఒకటి.పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం సెరోటోనిన్ మరియు డోపమైన్ స్థాయిల‌ను సమతుల్యం చేస్తుంది.కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.బ్రెయిన్ హెల్త్ కు నట్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి.బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటి వాటిని నిత్యం తీసుకుంటే మెదడు ఆరోగ్యాన్ని పెంచే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు సులభంగా పొందవచ్చు.

ఇక అవకాడో ( Avocado )కూడా మెదడు మెరుపు వేగంతో పని చేసేలా ప్రోత్సహిస్తుంది. అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు పలు రకాల విటమిన్స్ బ్రెయిన్ ను షార్ప్ గా మారుస్తాయి.

జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తిని పెంచుతాయి.అల్జీమర్స్ వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube