పేటలో బీఎస్పీ హవా...!

సూర్యాపేట జిల్లా:వట్టే జానయ్య యాదవ్( Janaiah Yadav ) బీఎస్పీ అభ్యర్ధిగా ప్రకటన వెలువడినప్పుడే పేట రాజకీయంలో పెను మార్పులకు నాంది పడిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానమే వస్తోంది.సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడ ఇద్దరు కూడినా వట్టే జానయ్య,ఏనుగు గుర్తు, బీఎస్పీ జెండాపైనే చర్చ సాగుతోంది.

 Bsp Wind In The Belly , Bsp, Janaiah Yadav, Brs, Bjp, Congress-TeluguStop.com

దీనితో అన్ని వర్గాల ప్రజల నుండి వట్టేకు ఊహించని మద్దతు లభిస్తోంది.ప్రజలు స్వచ్చందంగా బీఎస్పీలో చేరుతూ వట్టే జానయ్య యాదవ్ ను గెలిపించి తీరుతామని శపథం చేస్తున్నారని,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల వారిని సామాజిక న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని,బానిస బతుకుల విముక్తి కోసం స్వాతంత్ర్య పోరాటం ఏ విధంగా చేసామో,అగ్రకుల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ బహుజనులకు పిలుపునిస్తున్నారు.

సూర్యాపేట పట్టణ, నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ,బీజేపీ,కాంగ్రెస్ ( BRS, BJP, Congress )పార్టీలకు రాజీనామాలు చేస్తూ వందలాది మంది కార్యకర్తలు బీఎస్పీ పార్టీలో చేరుతున్నారు.ఎన్నికల ప్రచారానికి వస్తున్న వట్టేపై మహిళలు పూల వర్షం కురిపించగా, యువకులు గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు.

చివరికి అడ్వకేట్స్,నిరుద్యోగులు,కార్మికులు,కర్షకులు,అన్ని వర్గాల ప్రజలు బీఎస్పీకి జై కొడుతున్నారు.మంత్రి జగదీష్ రెడ్డిని వ్యతిరేకించి ధిక్కార స్వరం వినిపించిన వట్టే జానయ్య యాదవ్, బహుజన వాదంతో బీఎస్పీలో చేరి,ఎమ్మేల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా మంత్రి జగదీష్ రెడ్డి (బీఆర్ఎస్) వర్సెస్ వట్టే జానయ్య యాదవ్ (బీఎస్పీ)మధ్యే హై టెన్షన్ పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube