కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..!

సూర్యాపేట జిల్లా:కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో( Kodada Government Hospital ) మంగళవారం దారుణం చోటుచేసుకుంది.నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన మానస అనే గర్భిణీ డెలివరీ కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.

 Atrocity In Kodada Government Hospital..,kodada , Government Hospital , Baby , G-TeluguStop.com

ఆసుపత్రిలో సమయానికి గైనకాలజిస్ట్ డాక్టర్( Gynaecologist ) లేకపోవడంతో డ్యూటీలో ఉన్న నర్సు గైనిక్ డాక్టర్ అవతారమెత్తి గర్భిణికి సిజేరియన్ చేసింది.గైనిక్ చేయాల్సిన ఆపరేషన్ నర్సు చేయడంతో శిశువు మృతి చెందింది.

దీనితో ఆసుపత్రి నర్సులు భయంతో ఆసుపత్రి నుండి పారిపోయారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,బంధువులు ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం,నర్సుల అవగాహనా రాహిత్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిపై ఈ మధ్య కాలంలో అనేక రకాల వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నా సంబంధిత అధికారులకు ఏమీ పట్టనట్లు ఉండటం వల్లనేఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు.ఆసుపత్రిలో పని చేసే డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటే ఇలాంటి నష్టం జరిగేది కాదని,విధి నిర్వహణలో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తుందని,అయినా వైద్య,ఆరోగ్య శాఖలో చలనం లేదని మండిపడ్డారు.

ఏదైనా అనారోగ్య సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తిరిగి ఇంటికెళతామనేగ్యారంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube