అద్భుతమైన గాత్రంతో సాంగ్స్ హమ్ చేస్తున్న హమ్మింగ్ బర్డ్..!

పక్షుల చేసే సౌండ్స్ చాలా కొత్తగా, వింతగా మనకి అనిపిస్తాయి.

కొన్ని పక్షులు ఏ సౌండ్ వింటే దానిని అద్భుతంగా రిపీట్ చేసే టాలెంట్ ను కూడా కలిగి ఉంటాయి.

ఇప్పటికే పలు రకాల పక్షులు ఎన్నో సౌండ్స్ ఇమిటేట్ చేసి మనల్ని అబ్బురపరిచాయి.అయితే తాజాగా ఓ హమ్మింగ్ బర్డ్ కూడా తన అద్భుతమైన గాత్రంతో సాంగ్స్ హమ్ చేస్తూ అందర్నీ ఫిదా చేస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. యానిమల్స్ డూయింగ్ థింగ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్, 22 లక్షల లైకులు వచ్చాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో హమ్మింగ్ బర్డ్ తన యజమానురాలు భుజంపై వాలి ఉండటం చూడవచ్చు.ఆ తరువాత ఇది హ్యారీ పాటర్ సినిమాలోని ఒక థీమ్ మ్యూజిక్ ని హమ్ చేయడం వినొచ్చు.

Advertisement

ఇది చాలా అద్భుతంగా గుక్కతిప్పుకోకుండా కష్టతరమైన థీమ్ సౌండ్ చేయడం విని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇది చాలా టాలెంటెడ్ అని కితాబిస్తున్నారు.

బర్డ్ టాలెంట్ అందరికీ చూపిస్తూ యజమాని కూడా చాలా గర్వంగా ఫీల్ అయింది.కొద్ది రోజులుగా ఈ ట్యూన్ ని యజమాని నేర్చుకుంటుంటే ఈ హమ్మింగ్ బర్డ్ వింటుందట.

అలా ఇది ఆ పాట విని పర్ఫెక్ట్ గా హమ్ చేసింది.

పక్షి పేరు జెఫిర్ కాగా దీన్ని 2018లో ఫెర్న్ అనే మహిళ పెంచుకుంటుంది.ఫెర్న్ తన జెఫిర్ పక్షికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లలో పోస్ట్ చేస్తుంది.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను కూడా ఆమె మొదటగా టిక్‌టాక్ లో అప్లోడ్ చేసింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే ఈ వీడియో బాగుండటంతో ఇది మిగతా సైట్ లలో కూడా వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే యానిమల్స్ డూయింగ్ థింగ్స్ పేజ్ కూడా దీన్ని షేర్ చేసింది.

Advertisement

ఈ పేజీ రీచ్ చాలా ఎక్కువ కావడంతో వీడియో మరింత మందికి చేరువయింది.ఈ అద్భుతమైన వీడియోని మీరు కూడా తిలకించండి.

తాజా వార్తలు